![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో( Yea Devi Varamo Neevu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-21 లో.. గుడిలో ఒకామె పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. పూజారి గారు నా కూతురికి నెల రోజుల క్రితమే కాన్పు అయింది కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ కాన్పులోనే చనిపోయిందని పూజారితో ఆవిడ చెప్తుండటం పక్కనే ఉన్న గీతాంజలి వింటుంది. సంతానం లేని వారు ఎవరైనా సరే.. సంతానలక్ష్మికి తొమ్మిది శుక్రవారాలు పూజ చేయాలని, దాంతో వారికి ఫలితం లభిస్తుందని.. మీరు కూడా చేయండి అని ఆవిడకి పూజారి చెప్తాడు. ఆ మాటలు విని గీతాంజలి గతం గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వారి కోసం పూజ చేయమని చెప్తుంది. మరోవైపు అదే గుడిలో అంజలి పూజ చేస్తుంది. ఇక అనుకోకుండా అంజలిని గీతాంజలి చూస్తుంది.
వెంటనే తన వెంట పడినా అంజలి తప్పించుకుంటుంది. ఇక వెంటనే మనీష్ కి కాల్ చేస్తుంది గీతాంజలి. రేయ్.. నేను అంజలిని ఇక్కడ బంజారా హిల్స్ గుడిలో చూశానురా అని మనీష్ తో గీతాంజలి అనగానే చాన్సే లేదు అత్త.. అక్కడ ఉండే చాన్సే లేదని మనీష్ అంటాడు. అదేంట్రా నీకు తనెక్కడో ఉందో తెలుసా అంత కాన్ఫిడెంట్ గా ఇక్కడ ఉండదని చెప్తున్నావని గీతాంజలి అంటుంది. ఎక్కడో వైజాగ్ లో ఉండే అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ ఎలా ఉంటుందని మనీష్ కవర్ చేస్తాడు. ఇక ఫోన్ కట్ చేసి వెంటనే తాతయ్య దగ్గరికి పరుగున వస్తాడు మనీష్. తాతయ్య కొంపలు అంటుకుపోయాయని మనీష్ అనగానే ఏమైందిరా అని చాలా మాములుగా స్పందిస్తాడు రాజారావు. బంజారాహిల్స్ గుడికి అంజలి వెళ్ళిందంట అక్కడ గీతాంజలి అత్తయ్య తనని చూసిందంట అని మనీష్ చెప్పగానే రాజారావు షాక్ అవుతాడు. అప్పుడే అంజలి వస్తుంది.
అంజలి దగ్గరికి మనీష్ వెళ్లి గుడికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు. ప్రసాదం కోసమని అంజలి వెటకారం చేస్తుంది. నువ్వు గుడికి వెళ్ళకూడదని మనీష్ అంటాడు. ఎందుకు వెళ్ళకూడదని అంజలి అడుగుతుంది. మనీష్ ఏదో చెప్పబోయి ఆగిపోతాడు. నువ్వు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని మనీష్ అంటాడు. ఎందుకు వెళ్ళకూడదో కారణం చెప్పు వెళ్ళను అని అంజలి అనేసి వెళ్ళిపోతుంది. మరోవైపు అంజలిని ఎలాగైనా దక్కించుకోవాలని రాకీ ట్రై చేస్తుంటాడు. జ్యూస్ కావాలని అంజలిని రాకీ అడుగగా తను తీసుకొచ్చి ఇస్తుంది. బాగుందని రాకీ అనగానే అంజలి వెనక్కి తిరిగి చూస్తుంది. అదే జ్యూస్ బాగుంది నీకు ఒకటి ఇవ్వాలని పర్స్ లో నుండి డబ్బు తీస్తాడు. అది అంజలికి ఇవ్వబోతుంటే నేను డబ్బు కోసం ఇక్కడ ఉండట్లేదు అమ్మమ్మని చూసుకోవడానికి వచ్చానని అంజలి అంటుంది. ఈ కాలంలో డబ్బు కోసం కాకుండా ఇలా మనుషుల కోసం, విలువల కోసం ఉండేవారు చాలా అరుదుగా ఉంటారని రాకీ తనని పొగుడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |